HNK: ధర్మసాగర్ పెంతెకోస్తు ప్రార్థనా మందిర పాస్టర్ ప్రభాకర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. విషయం తెలుసుకున్న స్టేషన్ ఘన్‌పూర్ MLA కడియం శ్రీహరి ఈరోజు వారి నివాసానికి వెళ్లి ప్రభాకర్ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపి, ధైర్యం చెప్పారు. శనివారం ఆయన అంతక్రియలు జరగనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
పాస్టర్ మృతి.. కడియం నివాళి


