హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్లు బాగు చేయాలని AIYF డిమాండ్

NLG: డిండి మండలంలో పాడైపోయిన రోడ్లను వెంటనే మరమ్మతులు చేసి,పెండింగ్‌లో ఉన్న రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) డిమాండ్ చేసింది. రోడ్ల దుస్థితి కారణంగా ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే వచ్చే నెలలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.