హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జాతీయ రహదారిపై రైతుల ఆందోళన

NDL: శింగరాజుపల్లె జాతీయ రహదారిపై శుక్రవారం రైతులు ఆందోళన చేపట్టారు. గుమ్మడాపురం- శింగరాజుపల్లె గ్రామాల మధ్య కల్వకుర్తి -నంద్యాల రహదారి నిర్మాణం జరుగుతోంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో సంగమేశ్వరం, ఎత్తిపోతల ప్రధాన సాగునీటి పైపు లైన్‌కు డామేజ్ అయ్యి ఇబ్బందులు పడుతున్నామన్నారు. దీంతో 3,500 ఎకరాలకు సాగునీటి సరఫరా నిలిచి పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు.