హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు నాణ్యమైన విద్యా, వసతులే లక్ష్యం: జారే

BDK: ములకలపల్లి మండలం కమలాపురం ట్రైబల్ రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బోరువెల్, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.