హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప్పల్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం

MDCL: ఉప్పల్‌ సాయిబాబా నగర్‌ కాలనీలో రూ.60 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులను కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి పరమేశ్వర్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా కొత్త అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులు చేపడతామని తెలిపారు. అన్ని కాలనీల్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు.