హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: కడియం

JN: రఘునాథపల్లి మండలంలోని రైతు వేదికలో శుక్రవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేషన్ ఘన్పూర్ MLA కడియం శ్రీహరి హాజరై లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తుంది అని అన్నారు. రేషన్ సరఫరాలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఈ కార్డులు ఉపయోగపడతాయన్నారు.