హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

BDK: ములకలపల్లి మండలం రామాంజనేయపురంలో శుక్రవారం ట్రాక్టర్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఆయన భార్య తీవ్రంగా గాయపడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.