హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

MNCL: జన్నారం మండలంలోని లింగాయపల్లి పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి ఏసీబీకి చిక్కారు. గ్రామంలో ఒక ఇంటి పర్మిషన్‌కు కార్యదర్శి వరలక్ష్మి డబ్బులు డిమాండ్ చేసినట్లు స్థానికులు తెలిపారు. శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో ఆమె డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారని వారు తెలిపారు. దీనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.