హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే నివాసంలో వరలక్ష్మీ వ్రత మహోత్సవం

NLG: శ్రావణ మాసం సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో వారి సతీమణి వేముల పుష్ప శ్రీ వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పూజలు జరిగాయి. ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.