హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే

KMR: కళాశాలకు వెళ్లేందుకు సరిపడే బస్సులు లేవని, ఉన్నవి సకాలంలో రావడం లేదని ఈ నెల 7న కిష్టాపూర్ విద్యార్థినులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. బస్సు సౌకర్యం కల్పిస్తానని ఎమ్మెల్యే వారికి మాట ఇచ్చారు. శుక్రవారం ఎమ్మెల్యే పోచారం బీర్కూర్ నుంచి డిగ్రీ కళాశాలకు వెళ్లేందుకు విద్యార్థులకు ప్రత్యేక బస్సు ప్రారంభించారు.