హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ రికార్డుల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

BHPL: చిట్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి, సాదా బైనామా, బల్క్ ల్యాండ్ సర్వే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. సాదా బైనామాలో 2,325, భూ భారతి కింద 93 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నోటీసులు జారీ చేసి, ఫొటోలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.