హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం

VKB: తాండూర్ పట్టణంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ఇళ్లలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. కోరిన వరాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించే తల్లిగా వరలక్ష్మీదేవిని కొలుస్తున్నామని మహిళలు తెలిపారు. తోటి మహిళలకు వాయనం అందించి, ఆశీర్వాదాలు తీసుకున్నారు.