హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడిదపల్లిలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!

KMM: తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. సర్పంచ్ మోర అనిల్ రెడ్డి లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. అర్హులైన ప్రజలందరూ పంచాయతీ కార్యాలయానికి వచ్చి తమ కార్డులను తీసుకోవాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.