హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ పోస్టులు

ములుగు ప్రభుత్వ డిగ్రీకళాశాలలో బీకాం (బీఎఫ్‌ఎస్‌ఐ) విభాగంలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు ప్రిన్సిపల్ మల్లేశం తెలిపారు. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. డిగ్రీ స్థాయిలో బోధన అనుభవం ఉన్నవారికి వెయిటేజీ ఉంటుందని, అర్హత పత్రాలతో ఈనెల 24న ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.