హైదరాబాద్: 28°C
తెలంగాణ

101 అడుగుల ధర్మ ధ్వజం ఏర్పాటుకు భూమిపూజ

NZB: ఖిల్లా రామాలయ ఆవరణలో 101 అడుగుల ధర్మ ధ్వజం ఏర్పాటు చేసేందుకు భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ధర్మ ధ్వజం ఏర్పాటు చారిత్రాత్మకమని పేర్కొంటూ, ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, హిందూ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.