NZB: ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు. పాఠశాల పనులను వేగవంతం చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ
'పాఠశాల పనులను వేగవంతం చేయాలి'


