హైదరాబాద్: 28°C
తెలంగాణ

37వ సారి రక్తదానం చేసిన హెడ్ కానిస్టేబుల్

SRPT: శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడటంలోనూ పోలీసులు ముందుంటారని మరోసారి నిరూపితమైంది. విధి నిర్వహణలో బిజీగా ఉంటూనే సామాజిక సేవలో ఆదర్శంగా నిలుస్తున్నారు హెడ్ కానిస్టేబుల్ పాలెల్లి రమేష్. తాజాగా ఈరోజు సూర్యాపేట‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని కాపాడేందుకు ఆయన 37వ సారి రక్తదానం చేసి పెద్ద మనసు చాటుకున్నారు.