హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్డీవోపై మంత్రి ఆగ్రహం

NGKL: పెంట్లవెల్లి మండల రెవెన్యూ కార్యాలయాన్ని మంత్రి జూపల్లి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన రెవెన్యూ వినతులను పరిశీలించి సమీక్ష నిర్వహించారు. కార్యాలయం నుంచి RDO  కార్యాలయానికి వెళ్లే ఫైళ్లలో జాప్యంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన మంత్రి స్వయంగా నీళ్లు పోసి శుభ్రం చేశారు.