హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రావణ శుక్రవారం.. ఆలయానికి భక్తుల తాకిడి

MBNR: శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రానికి చెందిన వందలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.