హైదరాబాద్: 28°C
తెలంగాణ

'యువత సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలి'

ADB: మారుతున్న కాలానికి అనుగుణంగా యువత కంప్యూటర్ పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం పట్టణంలోని ఉర్దూ భవన్‌లో ఉర్దూ అకాడమీ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్, పబ్లిక్ రీడింగ్ రూమ్‌ను రాజర్షి షా ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు రీడింగ్ రూమ్ ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.