హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొల్తూరు చెరువులో రసాయన వ్యర్థాలు: ఎంపీ

పారిశ్రామిక కంపెనీల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలతో కొల్తూరు గ్రామంలోని కుంటలు, చెరువులు కలుషితమవుతున్నాయన్న సమాచారంతో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చెరువును పరిశీలించారు. జీడిమెట్ల కెమికల్ ఇండస్ట్రీ, తుర్కపల్లి, జవహర్‌నగర్ డంప్‌యార్డు ప్రాంతాల నుంచి మురుగునీరు, రసాయన వ్యర్థాలు చెరువులోకి వస్తున్నట్లు గుర్తించారు.