హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించిన గాయత్రి - ట్రీసా జోడీ

బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ గాయత్రీ గోపీచంద్ - ట్రీసా జాలీ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి సరికొత్త చరిత్ర సృష్టించింది. క్వార్టర్ ఫైనల్‌లో చైనాకు చెందిన జియా యి ఫాన్ - జాంగ్ షు షియాన్ జోడీపై 16-21, 21-15, 21-13 తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో గాయత్రి - ట్రీసా జోడీ భారత్‌కు పతకాన్ని ఖాయం చేసింది.