HYD: పద్మారావునగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా గుండు రఘురాం ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్ గౌడ్ ఆయనకు నియామక పత్రాలను అందజేశారు. తనపై విశ్వాసంతో బాధ్యతలు అప్పగించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ కె. లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు తదితరులకు రఘురాం ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
పద్మారావునగర్ బీజేపీ అధ్యక్షుడిగా నియామకం


