హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆక్రమణల తొలగింపుపై వ్యాపారుల ఆగ్రహం

VKB: తాండూర్ పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న చిరు వ్యాపారుల ఆక్రమణలను శుక్రవారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. దీనిపై వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ మున్సిపల్ నిర్ణయంపై మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు వ్యాపారులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఇదే రోడ్డులో ఎన్నో ఆక్రమణలు ఉన్నప్పటికీ చిరు వ్యాపారులపైనే ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.