హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

MLG: ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీకళాశాలలో బీకాం (బీఎఫ్‌ఎస్‌ఐ) విభాగంలో అతిథి అధ్యాపకుల పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రేణుక తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55 శాతం మార్కులతో, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. నెట్, సెట్, పీహెచ్‌డీ, బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు.