హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదగిరిగుట్టలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలోని కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని ఉచితంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం ఘనంగా నిర్వహించారు. మహిళల భక్తులు అధిక సంఖ్యలో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం ఆచరించారు. దేవస్థానంలో ప్రతి సంవత్సరం ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ.