హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మంలో అభివృద్ధి పనుల తనిఖీ..!

ఖమ్మం నగరంలోని 37, 42వ డివిజన్లు, ప్రభుత్వ ఆసుపత్రిలో సుడా నిధుల అభివృద్ధి పనులను సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కమిషనర్ అభిషేక్ అగస్త్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్లు, కాలువల నిర్మాణాలను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ఖాళీ స్థలాలను శుభ్రం చేసి వాహనాల పార్కింగ్‌కు అందుబాటులోకి తేవాలని సూచించారు.