ములుగు జిల్లా గ్రంథాలయంలో ఉద్యోగాల కోసం ప్రతిరోజూ వందలాది మంది యువత చదువుకుంటున్నారని, వారికి ప్రభుత్వం ఉచిత మధ్యాహ్న భోజనం అందించాలని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కలువల రవీందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఆకలితో చదువుకునే పరిస్థితి లేకుండా ప్రభుత్వం తక్షణమే భోజన సౌకర్యం కల్పించాలని కోరారు. లేనిపక్షంలో యువత తరఫున ఉద్యమం చేపడతామన్నారు.
తెలంగాణ
'గ్రంథాలయంలో ఉచిత భోజనం అందించాలి'


