హైదరాబాద్: 28°C
తెలంగాణ

తలకు తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో టీచర్

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు శివశంకర్ తలకు తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పెన్‌పహాడ్ మండలం దుబ్బ తండాలో విధులు నిర్వహిస్తున్న ఆయనను స్థానికులు గుర్తించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించిన వైద్యులు, ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.