హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్యాస్ ఈ-కేవైసీకి 23 వరకు గడువు

ఆసిఫాబాద్: సబ్సిడీ గ్యాస్ పక్కదారి పట్టకుండా ఈ-కేవైసీని తప్పనిసరి చేశారు. జిల్లాలో 12 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండగా 1,47,153 కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో మహాలక్ష్మి 78,467, ఉజ్వల 30,613, దీపం 22,087 కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు 85 శాతం ఈ-కేవైసీ పూర్తికాగా, ఈ నెల 23లోగా పూర్తి చేసుకోవాలని ఏజెన్సీలు సూచించాయి.