హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా సురేఖ బర్తరఫ్ కోరుతూ దీక్ష

జనగామ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ వైస్ ఛైర్మన్ కంచ రాములు చేపట్టిన నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల దృష్ట్యా కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసే వరకు ఈ దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. స్థానికంగా ఈ ఆందోళన కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశమైంది.