KMR: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని యాడారం గ్రామ సర్పంచ్ సుధారాణి బాపురెడ్డి అన్నారు. శుక్రవారం గ్రామంలో ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం వనమహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు.
తెలంగాణ
'ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి'


