JN: జనగామ పట్టణంలోని 20వ వార్డులో నూతన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ కడకంచి బాలమణి-శ్రీనివాస్ హాజరై 1,200 మంది లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. అర్హత ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం సరఫరా చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దామెర రామరాజు, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
1,200 కుటుంబాలకు డిజిటల్ రేషన్ కార్డులు


