హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన SP

BDK: అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, కేసుల వివరాలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు పలు సూచనలు చేశారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.