MHBD: బయ్యారం మండలం ఇర్సులాపురం సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇర్సులాపురం చెందిన రాసామళ్ల మంగమ్మ (52) తీవ్రంగా గాయపడి మృతి చెందారు. పలువురు కూలీలకు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
తెలంగాణ
కూలీల ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్.. ఒకరు మృతి


