హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెల్ట్‌ షాపులపై చర్యలు ఎప్పుడు..?

BDK: అశ్వారావుపేట ఏజెన్సీ ప్రాంతంలో గ్రామాల్లో అనధికారిక బెల్ట్‌ షాపులు పెరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిరాణా దుకాణాలు, బడ్డీల్లోనూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. బెల్ట్‌ షాపులపై ఎక్సైజ్‌ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.