KMM: నల్గొండ జిల్లాలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను ఖండిస్తూ ట్రస్మ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం నగరంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ నిర్వహించారు.పెవిలియన్ గ్రౌండ్ నుంచి జడ్పీ సెంటర్ వరకు ర్యాలీ సాగింది. విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ట్రస్మ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
'ఉపాధ్యాయుల భద్రతకు చర్యలు తీసుకోవాలి'


