హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయాల్లో శ్రావణ సందడి.. వరలక్ష్మి వ్రతాలు చేసిన మహిళలు

జగిత్యాల: జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో శుక్రవారం శ్రావణ సందడి నెలకొంది. ఈ సందర్భంగా మహిళలు వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని చింతకుంట వాడలో గల శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో మహిళలు వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. వడ్లగట్ట రాజన్న, వొడ్నాల శ్రీనివాస్ పాల్గొన్నారు.