MLG: వెంకటాపురం అడవిలో వంట చెరుకు సేకరించి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా అదుపుతప్పి కిందపడటంతో బెస్తగూడెం గ్రామానికి చెందిన జాడి రాములు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది కుప్పిలి రాధాస్వామి, ఈఎంటి రాజ్యలక్ష్మి అటవీ ప్రాంతానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. తొడ ఎముక విరగడంతో ములుగు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
తెలంగాణ
అడవిలో ద్విచక్ర వాహనం బోల్తా.. వ్యక్తికి తీవ్రగాయాలు


