హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిరుమలాపూర్‌లో రోడ్డు ప్రమాదం

MDK: జాతీయ రహదారి-161 పై ప్రమాదం తృటిలో తప్పింది. పెద్దశంకరంపేట,మండల పరిధిలోని తిరుమలాపూర్ చెరువు సమీపంలో వేగంగా వెళ్తున్న నీటి ట్యాంకర్ హఠాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే రహదారిపై ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రాణనష్టం ఏమీ సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.