నిర్మల్: కుబీర్ మండలం రంగశివుని తండా-2 గ్రామంలో శ్రీ జగదాంబ సేవాలాల్ మందిర నిర్మాణానికి టెండర్ ఆమోదం లభించింది. ఈ ఆమోద పత్రాన్ని ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి గ్రామస్తులకు అందజేశారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. తానూర్ మండల కేంద్రంలోని శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయానికి కూడా టెండర్ ఆమోదం లభించిందని పేర్కొన్నారు.
తెలంగాణ
సేవాలాల్ మందిర నిర్మాణానికి ఆమోదం


