హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేయాలి: డాక్టర్

SRPT: గంజాయికి అలవాటు పడుతున్న పిల్లలను ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యులను సంప్రదించాలని జిల్లా జీజీహెచ్‌ ఆర్ఎంవో డాక్టర్‌ ఉపేందర్‌సింగ్‌ సూచించారు. కళ్లు ఎర్రబడటం, ఆకలి తగ్గడం, నిద్రలేమి, చదువుపై శ్రద్ధ తగ్గడం వంటి మార్పులను తల్లిదండ్రులు గమనించాలన్నారు. పిల్లల ప్రవర్తనలో మార్పులను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు.