హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్లాస్టిక్‌ నిషేధానికి సహకరించాలి: మున్సిపల్ కమిషనర్

KMR: ఎల్లారెడ్డి మండలంలో ప్లాస్టిక్‌ మహమ్మారిని తరిమికొట్టి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎల్లారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ జె.జగ్జీవన్‌ కోరారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం, విక్రయంపై నిషేధం ఉందన్నారు. కూరగాయలు, మాంసం కొనుగోలుకు జ్యూట్‌, గుడ్డ, స్టీల్‌ కంటైనర్లను వినియోగించాలని సూచించారు.