హైదరాబాద్: 28°C
తెలంగాణ

KBR పార్కు చెట్ల నరికివేతపై ‘సుప్రీం’ కీలక నిర్ణయం

HYDలోని కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు పరిరక్షణకు సంబంధించిన వివాదంలో SC కీలక నిర్ణయం తీసుకుంది. KBR పార్కు చుట్టూ ప్రతిపాదించిన రోడ్డు విస్తరణ పనుల కోసం ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలోని చెట్లను నరికివేయకూడదంటూ గతంలో జారీ చేసిన స్టే ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం మరికొంత కాలం పొడిగించింది. హైకోర్టు జారీ చేసిన ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషనర్ కాజల్ మహేశ్వరీ SCను ఆశ్రయించారు.