హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి కరీంనగర్‌లో తేలికపాటి వర్షాలు

జగిత్యాల: గడిచిన 24 గంటల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్దగా వర్షాలు కురవలేదు. అక్కడక్కడా తేలికపాటి జల్లులు మాత్రమే నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా పొలాసలో అత్యధికంగా 5.5 మి.మీ వర్షపాతం నమోదైంది. మారేడుపల్లిలో 3.3, కరీంనగర్ జిల్లా గంగిపల్లిలో 5, పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో 1.5, రాజన్న సిరిసిల్ల జిల్లా మార్థాన్‌పేటలో 0.5 మి.మీ వర్షపాతం నమోదైంది.