BDK: కొత్తగూడెం మండలంలో రామవరం–కొత్తగూడెం ప్రధాన రహదారిలోని గోధుమ వాగు బ్రిడ్జిపై భారీ గుంత ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఎస్సై ప్రవీణ్ కుమార్, టూ టౌన్ ఎస్సై రాజశేఖర్ పరిశీలించి బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. వన్‌వే ట్రాఫిక్ అమలు చేసి రాకపోకలను క్రమబద్ధీకరించారు. ప్రయాణికులు గుంతను గమనించాలని కోరారు.
తెలంగాణ
గోధుమ వాగు బ్రిడ్జిపై భారీ గుంత


