SRCL: ఇల్లంతకుంట మండలం అనంతారం వద్ద సీఎంఆర్ బియ్యం లారీ బోల్తాపడింది. దాచారం రైస్‌మిల్ నుంచి కరీంనగర్ జిల్లా నగునూరు గోదాంకు బియ్యం తరలిస్తుండగా ఎదురుగా బస్సు రావడంతో తప్పించబోయి లారీ అదుపుతప్పి రోడ్డుకిందికి దిగి బోల్తాపడింది. ప్రమాదంలో ప్రాణనష్టం తప్పింది. బియ్యాన్ని మరో లారీలోకి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ
అనంతారంలో సీఎంఆర్ బియ్యం లారీ బోల్తా


