SRPT: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పనితీరు అద్భుతంగా ఉందని.. ఛైర్మన్ వేణారెడ్డి చురుగ్గా పనిచేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. మార్కెట్‌లో రూ.3.80 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రైతుల కోసం ఉచిత అల్పాహారం, రూ.5కే భోజన సౌకర్యం అందించడం అభినందనీయమన్నారు. మామిడి మార్కెట్ ఏర్పాటుకు 10 ఎకరాలు కేటాయించాలని కలెక్టర్ ను ఆదేశించారు.
తెలంగాణ
వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి పెద్దపీట: మంత్రి


