BHNG: భువనగిరి పట్టణంలోని బంజారాహిల్స్‌లో విద్యుత్ నియంత్రిక ప్రమాదకరంగా ఉంది. నియంత్రికకు కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు పలుమార్లు కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేబుళ్లు, ఫీజు బాక్సులు కిందికి ఉండటంతో పిల్లలు, పశువులకు ప్రమాదం పొంచి ఉంది. వెంటనే కంచె ఏర్పాటు చేసి ప్రమాదాన్ని నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రమాదకరంగా విద్యుత్ నియంత్రిక


