హైదరాబాద్: 28°C
తెలంగాణ

సామాన్యుడిలా రేషన్ తీసుకున్న సర్పంచ్

NZB: సిరికొండ మండలం హుస్సేన్‌నగర్ సర్పంచ్ జీల మల్లేష్. రేషన్ పంపిణీ సందర్భంగా సర్పంచ్ అనే వ్యత్యాసం చూపకుండా సాధారణ గ్రామస్తుడిలా లైన్లో నిలబడి రేషన్ బియ్యం తీసుకున్నారు. ప్రజాప్రతినిధి అంటే హంగూ ఆర్భాటం కాదని నిరూపించారు. ఆయన సరళతను గ్రామస్తులు అభినందించారు. ఈ సర్పంచ్ తీరుపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.